Skip to main content

Namaste NRI

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన నాగచైతన్య, శోభిత

అక్కినేని వారి ఇల్లు కల్యాణకాంతులతో వెలుగులీనింది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహబంధంలోకి అడుగుపెట్టారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి, హీరో కార్తి, రామ్‌చరణ్‌, రానా, నాని, కీరవాణితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చైతన్య, శోభిత తమ జీవితంలో అందమై న అధ్యాయాన్ని మొదలుపెట్టారు. నాకిది భావోద్వేగభరితమైన క్షణం. శోభితను మా అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. నాన్న ఏఎన్నార్‌ శతజయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహం ముందు ఈ పెళ్లి వేడుక జరగడం గొప్ప సంతోషాన్నిస్తోంది అని నాగార్జున పేర్కొన్నారు

Social Share Spread Message

Latest News