Namaste NRI

జైలర్ ట్రైలర్‌ లాంచ్ చేసిన నాగచైతన్య

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కావాలయ్య, హుకుం పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జైలర్ థియేట్రికల్ ట్రైలర్ ని యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య లాంచ్ చేశారు. రజనీకాంత్ పవర్ ఫుల్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్, స్వాగ్,  డైలాగ్ డెలివరీ, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ అద్భుతంగా వుంది. రజనీ తనదైన మార్క్ తో కట్టిపడేశారు. ఆసక్తికరమైన కథాంశంతో, ఆకట్టుకునే విజువల్స్ తో  ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ని అందిస్తూ మెస్మరైజ్ చేసి క్యురియాసిటీని పెంచింది ట్రైలర్.

యాక్షన్‌ కామెడీ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రంలో మలయాళ సూపర్‌ స్టార్ హీరో మోహన్ లాల్‌, సునీల్‌, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జైలర్‌లో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్‌ రవి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జైలర్‌ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై పాపులర్ లీడింగ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జైలర్‌ ఆగస్టు 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events