నాగచైతన్య మత్స్యకారుడి పాత్రలో నటిస్తూ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సాయిపల్లవి కథానాయిక. ఇటీవల ఈ చిత్రం శ్రీకాకుళం షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. విశాఖపట్నం, శ్రీకాకుళంలోని సుందరమైన లొకేషన్లలో కీలకమైన ఘట్టాలను తెరకెక్కించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/06/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-122.jpg)
సన్నివేశాల్లో వాస్తవికత ప్రతిబింబించేలా స్థానిక మత్స్యకారులను షూటింగ్‌లో భాగం చేశారు. అనూహ్య పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం చేతిలో బందీ కాబడ్డ భారత జాలరులు అక్కడి నుంచి ఎలా బయపడ్డారు? దేశభక్తిని గుండెల్లో నింపుకున్న ఆ మత్స్యకారుల బృందం చేసిన సాహసాలేమిటన్నదే ఈ చిత్ర కథాంశం. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సమర్పణ: అల్లు అరవింద్, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.
![](https://namastenri.net/wp-content/uploads/2024/06/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-118.jpg)