నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం కస్టడీ. ఈ చిత్రంలో కృతి శెట్టి నాయికగా నటిస్తున్నది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్నారు. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఆయన ఎ.శివ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ప్రచార చిత్రంలో ఆయన్ని చూపించిన తీరును బట్టి, సినిమాలో శివ తను నమ్మే సిద్ధాంతం కోసం సొంత వ్యవస్థతోనే పోరాటం చేయనున్నాడని అర్థమవుతోంది. మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు మీరే అయి ఉండాలి అంటూ వెంకట్ ప్రభు ఈ పోస్టర్‌కు జోడిరచిన వ్యాఖ్య ఆసక్తిరేకెత్తిస్తోంది. వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందుతుంది. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు. ఎస్.ఆర్. కతీర్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
