Skip to main content

Namaste NRI

నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్ ఫస్ట్ సింగిల్ విడుదల

హీరో నాగశౌర్య అప్‌ కమింగ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌. విధి కథానాయిక. రామ్‌ దేశినా దర్శకుడు. శ్రీనివాసరావు చింతలపూడి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిందని మేకర్స్‌ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేశారు.

నా మావ పిల్లనిత్తానన్నాడే  అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్‌ రాయగా, హేరిస్‌ జైరాజ్‌ స్వరపరిచారు. కారుణ్య, హరిప్రియ కలిసి ఆలపించారు. నాగశౌర్య, విధి కెమిస్ట్రీ ఈ పాటలో చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందని, వారి డాన్స్‌ మూమెంట్స్‌ కూడా ఆకట్టుకుంటాయని మేకర్స్‌ చెబుతున్నారు. సీనియర్‌ నరేష్‌, సాయికుమార్‌, సముద్రఖని, శ్రీదేవి విజయ్‌కుమార్‌, వెన్నెల కిశోర్‌, మైమ్‌ గోపీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్‌ ఎల్లోర్‌, నిర్మాణం: శ్రీవైష్ణవి ఫిల్మ్స్‌.

Social Share Spread Message

Latest News