Skip to main content

Namaste NRI

నాగార్జున నా సామిరంగ టీజర్ విడుదల

అక్కినేని నాగార్జున నటిస్తున్న చిత్రం నా సామిరంగ. విజయ్‌ బిన్నీ దర్శకుడు. ఆషికా రంగనాథ్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలను పోషిస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా స్నేహబంధం చుట్టూ అల్లుకున్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. నాగార్జున-ఆషికా రంగనాథ్‌ మధ్య వచ్చే సరదా సన్నివేశాలు, అల్లరి నరేష్‌, రాజ్‌తరుణ్‌తో నాగార్జున ఫ్రెండ్షిప్‌ను తెలియజేస్తూ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. మామిడి తోటలో నాగ్‌ ఎంట్రీ ఫైట్‌ సీన్‌ ప్రధానాకర్షణగా నిలిచింది. స్నేహం, యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో టీజర్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నాగార్జున గోదావరి యాసలో మాట్లాడుతూ కనిపించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరథి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కథ, మాటలు: ప్రసన్నకుమార్‌ బెజవాడ, సాహిత్యం: చంద్రబోస్‌, దర్శకత్వం: విజయ్‌ బిన్ని.

Social Share Spread Message

Latest News