నిజామాబాద్ ఎమ్మెల్సీగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవితకు టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీగా కవిత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తెలంగాణ జాగృతితో రాష్ట్ర పండుగ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేశారన్నారు. కవిత సాంస్కృతిక వారధిగా నిలిచారని అన్నారు. సమైక్యరాష్ట్రంలో ఆత్మనూన్యతకు, పాలకు వివక్షకు గురైన బతుకమ్మ పండుగను తెలంగాణ బిడ్డగా భుజాన వేసుకుని ప్రపంచం గుర్తించేలా చేసిందన్నారు. బతుకమ్మ విశిష్టతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారన్నారు. జాగృతి సంస్థ ద్వారా బతుకమ్మ వేదికగా మహిళలను చైతన్య పరచి తెలంగాణ ఉద్యమంలో మహిళలు ప్రధాన పాత్ర పోషించేలా కృషి చేశారన్నారు.
అరవై దశాబ్దాల పాలనలో తీవ్ర వివక్షత గురైన నిజామాబాదు పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తెచ్చి ఇంతవరకు ఎవరు చేయని అభివృద్ధి కార్యక్రమాలను చేసి నిజామాబాద్ రూపురేఖలను మార్చిన ధీర వనిత అని కొనియాడారు. ఈ ంసదర్భంగా కవిత మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాక్షించారు.