అభిస్తి సేవా పురస్కార్ అవార్డును టీఆర్‌ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల అందుకున్నారు. 2020 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో కరోనా, వరదలు సమయంలో సహాయ కార్యక్రమాలకి అన్ని వైపుల నుంచి సహాయ సహకారాలు అందాయి. అభిస్తి వెల్ఫేర్ సొసైటీ, బాగీస్ ఫుడ్ కోర్ట్ సహకారంతో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసారు. ఈ పంపిణీకి టీఆర్‌ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా తమ వంతు సాయంగా ఎంతో మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేసింది. అందుకుగాను అభిస్తి వెల్ఫేర్ సొసైటీ తమ 7వ వార్షికోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖకి పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారాన్ని ఆ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అందుకున్నారు. ఈ సందర్భంగా తమకు అన్ని వేళలా అండగా నిలిచిన సౌత్ ఆఫ్రికాలోని ప్రజలకు నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఆఫ్రికా శాఖ కార్యవర్గ సభ్యులు హరీష్ రంగా, సాయి వేముల పాల్గొన్నారు.