Namaste NRI

నమస్తే ఇండియా.. భారతీయుడు తిరిగొచ్చాడు

 కమల్‌హాసన్‌ – శంకర్‌ కాంబినేషన్‌లో భారతీయుడు 2 రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. సిద్దార్థ్‌, ప్రియా భవానీ శంకర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుభాస్కరన్‌ నిర్మాత. భారతీయుడు 2  ఇంట్రో గ్లింప్స్‌ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఈ గ్లింప్స్‌ ఆసక్తికరంగా సాగింది. దేశంలో లంచగొండితనం పెరిగిపోవడంతో విసిగెత్తిపోయిన ప్రజలు కమ్‌ బ్యాక్‌ ఇండియన్‌ అంటూ భారతీయుడ్ని స్వాగతిస్తూ హ్యాష్‌ ట్యాగులతో ఓ ఉద్యమమే చేస్తారు. చివరికి భారతీయుడు తిరిగి వస్తాడు. అక్కడి నుంచి ఏం జరిగిందన్నది తెరపైనే చూడాలి. భారతీయుడులో కీలక పాత్ర పోషించిన స్వర్గీయ నడిముడి వేణు ఇందులోనూ కీలకపాత్ర పోషించారు. ఇంకా బ్రహ్మానందం, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, బాబీ సింహా తదితరులు వీడియోలో తళుక్కున మెరిశారు. అనిరుథ్‌ సంగీతం ఈ వీడియోకు ప్రత్యేక ఆకర్షణ. రవి వర్మన్‌ ఫొటోగ్రఫీ,  ప్రొడక్షన్‌ డిజైనర్‌: టి.ముత్తురాజ్,  సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events