Namaste NRI

నందమూరి వారసుడొచ్చాడు…మోక్షజ్ఞ లుక్‌ చూశారా

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ తనయుడు నంద మూరి మోక్షజ్ఞ తొలి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని సుధాకర్‌ చెరుకూరి తన ఎస్వీఎల్‌ సినిమాస్‌పై లెజెండ్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని ఈ సినిమాకి సమర్పకురాలు కావడం విశేషం. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని స్టైలిష్   అండ్‌ మోడరన్‌ అవతార్‌లో ప్రజెంట్‌ చేస్తూ ఓ స్టిల్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆకర్షణీయమైన చిరునవ్వుతో, మెస్మరైజింగ్‌ ప్రజెన్స్‌తో చాలా అందంగా కనిపిస్తున్నారు మోక్షజ్ఞ.

ప్రశాంత్‌వర్మ మాట్లాడుతూ మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే అవకాశం రావడం గొప్ప గౌరవంగా, అంతకంటే పెద్ద బాధ్యతగా భావిస్తున్నా. ఇది ఇతిహాసాల నుంచి స్పూర్తి పొందిన స్క్రిప్ట్‌. ప్రశాంత్‌ వర్మ సినిమా యూనివర్స్‌లో ఇది ఒక భాగం. నా యూనివర్స్‌ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుంది. ప్రస్తుతం మోక్షూ నటశిక్షణలో ఉన్నారు. డ్యాన్స్‌, ఫైట్లు.. ఇలా ప్రతి విషయంలో స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు.

ఈ సినిమాతో ఓ గొప్ప స్టార్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న క్రెడిట్‌ నాకు దక్కనున్నది అని ఆనందం వ్యక్తం చేశారు. మోక్షజ్ఞని హీరోగా లాంచ్‌ చేసే సువర్ణావకాశాన్ని మాకిచ్చిన బాలకృష్ణగారికి కృతజ్ఞతలు. ప్రశాంత్‌ వర్మ అద్భుతమైన స్క్రిప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం అని నిర్మాత సుధాకర్‌ చెరుకూరి తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events