నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమా దసరా. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత ఒద్దెల సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనలు బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తోంది. తెలంగాణ యాసలో విడుదలై ఓ పాట ఇప్పటికే ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నాని రఫ్ లుక్ లో కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్ , సాయి కుమార్, సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, మీరా జాస్మిన్, పూర్ణ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. దసరా సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు రూ.70 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని మార్చి 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.