రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని నటిస్తోన్న శ్యామ్ సింగ రాయ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిర్మాత వెంకట బోయనపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. నాని కెరీర్లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో నాని, సాయి పల్లవిలపై ఓ రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. హీరో హీరోయిన్ల మధ్య అద్భుతమైన ప్రేమ కథ ఉండబోతోందని పోస్టర్‌ను చూస్తే తెలుస్తోంది. సినిమా మీదున్న బజ్ దృష్ట్యా తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాహుల్ రవీంద్రన్, మురళీశర్మ, అభివన్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీషవద్వా తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాను జాన్ వర్ఘీస్, సంగీతం : మిక్కీ జే.మేయర్, కూర్పు: నవీన్ నూలి.