అమెరికాలో న్యూయార్క్ మహానగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదినం పురస్కరించుకొని మన్నవ మోహనకృష్ణ యూత్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. డిజిటల్ స్క్రీన్ మీద లోకేశ్ చిత్రాన్ని ప్రదర్శించి, కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. అనంతరం మన్నవ మోహన కృష్ణ యూత్ సభ్యులు టైమ్స్ స్క్వేర్ వద్ద జై లోకేశ్ జై జై లోకేశ్ అంటూ నినాదాలతో హోరేత్తించారు.
ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ యూత్ సభ్యులు మాట్లాడుతూ నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, అక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ, యువగళం పాదయాత్రతో ప్రజలకు మరింత చేరువయ్యారని అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో మన్నవ మోహనకృష్ణ యూత్, ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని యువనేత నారా లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.