
టాలీవుడ్ హీరో నారా రోహిత్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కన్వెన్షన్ సెంటర్‌లో ఆయన నటి శిరీషను వివాహం చేసుకున్నారు. ఈ వేడుక ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. వివాహ వేడుకకు రోహిత్ పెదనాన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్, తోపాటు పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నారా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
















