Namaste NRI

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన నారా రోహిత్ కొత్త సినిమా

నారా రోహిత్‌ నూతన చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. నయన్‌సారిక కథానాయిక. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు చినిమిల్లి మణికుమార్‌ దర్శకుడు. భరత్‌చౌదరి చెరుకూరి నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు కొరటాల శివ క్లాప్‌ కొట్టగా, సీనియర్‌ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కెమెరా స్విచాన్‌ చేశారు. హీరో నారా రోహిత్‌ మాట్లాడుతూ పూర్తిస్థాయి వినోదాత్మక కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నది. చక్కని టీమ్‌ కుదిరింది అని అన్నారు.

రోహిత్‌ గర్వపడే సినిమా అవుతుందని నిర్మాత భరత్‌చౌదరి చెప్పారు. నారా రోహిత్‌ సోలో సినిమాను రికలక్ట్‌ చేసుకునేలా సినిమా ఉంటుందని దర్శకుడు చినిమిల్లి మణికుమార్‌ నమ్మకంగా చెప్పారు. నరేశ్‌ వీకే, రోహిణి, సంపత్‌, అజయ్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శ్రీలత చెరుకూరి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events