జనవరి 24 లో జరిగిన తానా ఎన్నికల లో Dr నరేన్ కొడాలి వర్గం దాదాపు అన్ని పదవులలో గెలిచిన విషయం, ఎన్నికల నిర్వహణ లో తప్పులు జరిగాయి అంటూ రెండవ వర్గం కోర్టు ని ఆశ్రయించిన సంగతి, చివరకి న్యాయ స్థానం కూడా అన్ని వివరాలు మరొక్క సారి పరిశీలించి తమ అభిప్రాయం వెలిబుచ్చిన సంగతి, తానా బోర్డ్ ఎన్నికల తీర్పు ని ఆమోదించిన సంగతి అందరికి తెలిసిందే.
ఎన్నికల లో గెలిచిన అభ్యర్థులు అందరూ తమ పదవులు స్వీకరించి, బాధ్యతలు చేపట్టిన తరువాత శనివారం, 23 మార్చ్ 2024 సాయత్రం వాషింగ్టన్ డీసీ లో ఒక విజయోత్సవ సభ నిర్వహించారు. నగరం లోని తానా సభ్యులు, శ్రేయోభిలాషులు అందరూ వచ్చిన ఈ వేడుక దాదాపు 600 మంది తో ఘనంగా జరిగింది. అన్ని నగరాల నుంచి Dr నరేన్ కొడాలి టీమ్ లో గెలిచిన వారు, శ్రేయోభిలాషులు వచ్చిన ఈ వేడుకలో నరేన్ కొడాలి విజేతలు అయిన అందరినీ స్టేజ్ మీదకు తనకు మద్దతు గా పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వేడుకలో Dr నరేన్ కొడాలి తన ప్రసంగం లో గత రెండు సంవత్సరాలుగా తనను అధ్యక్ష పదవికి చేరకుం డా ప్రత్యర్థి వర్గం అనేక బాధలు పెట్టిందని, కోర్టు చుట్టూ తిప్పిందని, వ్యక్తి గత దూషణలు, ఆరోపణలు చేసిందని, కేవలం తానా సంస్థ మీద అభిమానంతో తాను, తన కుటుంబం నిలబడిందని తెలిపారు. ఇంకా ఇబ్బందులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. తానా ప్రతిష్ట ను మరింత పెంచేలా తెలుగు కమ్యూనిటీ కి సేవ చేస్తామని తెలిపారు.
ఈ వేడుకకు శ్రీనివాస్ లావు, రవి పొట్లూరి, రాజ కసుకుర్తి, వెంకట్ కోగంటి, సునీల్ పంత్ర, లోకేష్ కొణిదెల, నాగా పంచుమర్తి, టాగోర్ మలినేని, సతీష్ కొమ్మన, ఎందురి శ్రీనివాస్, రామ్ అల్లు , వెంకట్ అడుసుమిల్లి, కె పి సొంపల్లీ, నీలిమ మన్నే, సతీష్ చింత, వెంకట్ సింగు, సురేష్ పాటిబండ్ల మరి కొందరు విజేతలు వచ్చారు. అలాగే తానా పెద్దలు జయరామ్ కోమటి, సతీష్ వేమన, శ్రీనివాస్ గోగినేని, ప్రసాద్ నల్లూరి తదితరులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అనిల్ ఉప్పలపాటి, సాయి బొల్లినేని, సతీష్ చింత, జనార్దన్ నిమ్మలపూడి, త్రిలోక్ కంతేటి, సుధీర్ కొమ్మి, రాజేష్ కాసరనేని మరియు వర్జీనియా నరేన్ కొడాలి మిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు.