ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం నారి. సీనియర్ నటి ఆమని లీడ్‌రోల్ చేసిన ఈ చిత్రంలో వికాస్ వశిష్ఠ, మౌనికరెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ కీలక పాత్రధారులు. సూర్య వంటిపల్లి దర్శకుడు. శశి వంటిపల్లి నిర్మాత. ఈ సందర్భంగా ఈ సినిమా పోస్టర్, గ్లింప్స్ ని విడుదల చేసిన రాష్ట్రమంత్రి సీతక్క చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరించాలి? వారికి ఎలా సహకరించాలి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ప్రతి మహిళా తమ ఇంట్లోని పురుషుడ్ని వెంట తీసుకెళ్లి ఈ సినిమా చూపించాలి అని దర్శకుడు కోరారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: వి.రవికుమార్, భీమ్ సాంబ, సంగీతం: వినోద్‌కుమార్.