జో శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా నర్మద. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి చిత్ర సమర్పకుడు మోహన్ వడ్లపట్ల క్లాప్ ఇచ్చారు. నటుడు కాదంబరి కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఊరిలో జరిగే అన్యాయాలను ఎదిరించే సాహసమున్న యువతి నర్మద. ఊరి బాగు కోసం చేసే పోరాటంలో ఆమెకు పరిస్థితులు అనేది ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాం అన్నారు. ఈ నెల 20 నుంచి రాజమండ్రిలో తొలి షెడ్యూల్ ప్రారంభిస్తామని, 12 రోజుల పాటు అక్కడ షూట్ చేస్తామన్నారు. రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభిస్తామన్నారు. జెమిని సౌమిక సంహిత్ సిల్వర్ స్కీన్స్ పతాకంపై మోహన్ వడ్లపట్ల సమర్పణలో డా ఎమ్‌ఆర్ చౌదరి, ఆళ్ల రాఘవ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శుభాకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ముప్పలనేని శివ, నటుడు కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)