Namaste NRI

నార్నే నితిన్, నయన్ సారిక జంటగా ఆయ్

నార్నే నితిన్‌, నయన్‌ సారిక జంటగా రూపొందుతోన్న ప్రేమకథ ఆయ్‌.  అంజి కంచిపల్లి దర్శకుడు. బన్నీ, విద్యా కొప్పినీడి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది. టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ దగ్గర్నుంచి ఈ సినిమా ప్రమోషన్‌ విషయంలో మేకర్స్‌ విభి న్నంగా ముందుకెళ్తున్నారు. ఈ నెల 20న ఈ సినిమాకు సంబంధించిన సూఫియానా అంటూ సాగే గీతాన్ని మేకర్స్‌ విడుదల చేయనున్నారు. ఈ సంరద్భంగా ఓ కాన్సెప్ట్‌ వీడియోను విడుదల చేశారు. హీరోహీరోయన్ల తోపాటు సినిమా టీమ్‌ మెంబర్స్‌తో క్రియేట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌ కల్యాణి, సంగీతం: రామ్‌ మిర్యాల, సమర్పణ: అల్లు అరవింద్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events