కమ్యునికేషన్ టెక్నాలజీని ఉపయోగించి నాసా మొట్టమొదటి సారి అంతరిక్షంలోకి 4కే వీడియో ప్రసారాలను చేయగలిగింది. ఆకాశంలోని ఓ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్), తిరిగి అక్కడ్నుంచి.. ఈ వీడియో ప్రసారాలను భూమిపైకి చేపట్టడంలో నాసా సక్సెస్ అయ్యింది. ఆర్టెమిస్ మిషన్స్ లో భాగంగా చంద్రుడిపైకి నాసా వ్యోమగాముల్ని పంపబోతున్నది.
ఇందుకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలు తాజా ప్రయోగంతో సాధ్యమవుతాయని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. భవిష్యత్తులో 4కే హెచ్‌డీ వీడియో ప్రసారాలు సాధ్యమేనని నాసా ఇంజినీర్ల బృందంలోని సైంటిస్టు డానియల్ రాయిబల్ చెప్పారు. వ్యోమగాముల ఆరోగ్యం, కార్యచరణను సమన్వయం చేయడానికి ఈ ప్రత్యక్ష ప్రసారాలు కీలకమవుతాయని అన్నారు.