Skip to main content

Namaste NRI

సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై .. క్లారిటీ ఇచ్చిన నాసా

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న భారతీయ అమెరికన్‌ ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌ ఆరోగ్యంపై ఇటీవలే ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఐఎస్‌ఎస్‌లో సునీతా విలియమ్స్‌ బరువు తగ్గినట్లుగా, నీరసంగా ఉన్నట్లు ఓ ఫొటో ఇటీవలే బయటకు వచ్చింది. దీంతో ఆమె తీవ్ర పోషకార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లనే ఆమె బలహీనంగా కనిపిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

దీంతో సునీతా విలియమ్స్‌ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. ఈ వార్తలపై నాసా  తాజాగా స్పందించింది. ఆస్ట్రోనాట్‌ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చింది. సునీతా విలియమ్స్‌ సహా అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. వ్యోమగాములకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరుగుతాయని, ఫ్లైట్ సర్జన్లు పర్యవేక్షిస్తారని వెల్లడించింది.

Social Share Spread Message

Latest News