నాసా తొలి ప్రయోగం విజయవంతం అయ్యింది. భవిష్యత్తులో గ్రహశకలాల నుంచి భూమికి పొంచి ఉన్న ప్రమాదాలను తప్పించడానికి నాసా శాస్త్రవేత్తలు రూపొందించిన డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) మిషన్ తొలి దశ ప్రయోగం సక్సెస్ అయ్యింది. కాలిఫోర్నియాలోని వాండేన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ ఇందుకు వేదికైంది. భూమికి 1.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న డిడిమోస్ గ్రహశకల వ్యవస్థలోని డిమార్పస్ అనే గ్రహశకలాన్ని ఢీకొట్టడానికి స్పేస్ఎక్స్కు చెందిన ఎల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. ఈ మేరకు తొలిదశ విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు వెల్లడిరచారు. నిర్ణీత ఆస్టరాయిడ్ వేగాన్ని తగ్గించి, ప్రయాణ దిశను మార్చడమే ఈ టెస్ట్ మిషన్ ప్రదానోద్దేశం. ఈ ప్రయోగంలో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్, ప్రత్యేక లేజర్ కిరణాలు కీలక పాత్ర పోషించనున్నాయి. రోదసి చరిత్రలో అత్యంత క్లిష్ట ప్రయోగాల్లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)