దాసి చిత్రానికిగాను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డు దక్కించుకొని దాసి సుదర్శన్‌గా ప్రసిద్ధుడైన పిట్టంపల్లి సుదర్శన్ (73) మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. మిర్యాలగూడకు చెందిన ఆయన ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించారు. అనంతర కాలంలో కళా దర్శకుడిగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా, రచయితగా, కార్టూనిస్టుగా, పాత్రికేయుడిగా, ఫొటోగ్రాఫర్‌గా ప్రసిద్ధికెక్కారు. ప్రముఖ దర్శకులు బి.నర్సింగ రావు తీసిన అనేక చిత్రాలకు సుదర్శన్ కళా దర్శకుడిగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. నర్సింగరావు దర్శక త్వం వహించిన దాసి చిత్రం ఐదు జాతీయ అవార్డులను దక్కించుకోగా అందులో సుదర్శన్ కాస్ట్యూమ్ డిజైన ర్‌గా అవార్డు పొందారు. అనంతరం ఆయన జాతీయ అవార్డుల జ్యూరీలో సభ్యులుగా పనిచేశారు.