
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బి.ఆర్. నాయుడు కి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆహ్వానించింది. తిరుమలలో బి.ఆర్. నాయుడిని కలిసిన నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించి సంబరాల ప్రాముఖ్యతను వివరించింది. నాట్స్ సంబరాలకు తప్పనిసరిగా రావాలని బి.ఆర్. నాయుడును కోరింది. ఈ కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి పాల్గొన్నారు.
