Namaste NRI

కాలిఫోర్నియాలో నాట్స్ మహిళా సంబరాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కాలిఫోర్నియాలో మహిళా సంబరాలు నిర్వహించింది. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని నాట్స్ ప్రతియేటా మహిళా సంబరాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌లో మహిళా సంబరాలు నిర్వహించింది. తెలుగు మహిళలు ఆట, పాటలతో సంబరాలకు వచ్చిన వారిలో ఉత్సాహాన్ని నింపారు. 120 మంది మహిళలతో నిర్వహించిన ఫ్యాషన్ షో ఈ సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. ఆసియా యూఎస్ఏ సరోజా అల్లూరి ఈ ఫ్యాషన్‌ షోలో పాల్గొని ఔత్సాహికులను ప్రోత్సాహించారు. మహిళా సంబరాల్లో శాస్త్రీయ నృత్యాలు, జానపద చిందులు, బాలీవుడ్, టాలీవుడ్ డ్యాన్స్‌లు అందరిని ఆకట్టుకున్నాయి. సంబరాల్లో భగవద్గీత పఠనం కూడా మన సంస్కృతిని మరిచిపోలేమంటూ చాటి చెప్పింది. సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించిన నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగానికి నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

నాట్స్ హెల్ఫైలైన్ ద్వారా తెలుగువారికి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అరుణ గంటి వివరించారు. తెలుగువారికి అమెరికాలో ఏ కష్టమొచ్చినా నాట్స్ అండగా నిలబడుతుందుని భరోసా ఇచ్చారు. నాట్స్‌లో మహిళలకు అధికా ప్రాధాన్యం ఇస్తుందని,  దానికి నిలువెత్తు నిదర్శనమే మా నాట్స్ ఛైర్ పర్సన్ అరుణ గంటి అని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి తెలిపారు. మహిళల సమస్యలపై నాట్స్ ప్రత్యేక దృష్టి పెడుతుందని వారికి ఏ కష్టమొచ్చినా తక్షణమే స్పందించి తన వంతు సాయం చేస్తుందని తెలిపారు. మేలో జరగనున్న నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు తెలుగువారంతా రావాలని ఈ సందర్భంగా బాపు నూతి ఆహ్వానించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events