Namaste NRI

 ఆస్కార్ బరిలో నాటు నాటు

దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో  నిలిచింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ టాప్ -4లో నిలిచింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి అంతర్జాతీయ దర్శకుడిగా మారిపోయాడు. ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి మంచి ఆదరణ పొందుతుంది. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ ఇండియన్స్‌తో  పాటు విదేశీయులను సైతం ఆకట్టుకుంది. ఇందులో నాటు నాటు సాంగ్ కోసం విదేశీ సెలబ్రెటీలు సైతం డ్యాన్స్‌లు  చేశారు. అంతలా ఫిదా చేసింది కాబట్టే ఈ నాటు నాటు సాంగ్ను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఈ అవార్డు రావడంతో ఆస్కార్ బరిలో కూడా నిలుస్తుందని అంతా భావించారు. అనుకున్నట్టే ఫైనల్ నామినేషన్స్‌లో  నిలిచింది.

95వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ ప్రకటించారు. అమెరికా కాలిఫోర్నియాలోని శామ్యూల్స్ గోల్డిన్ థియేటర్ వేదికగా ఈ నామినేషన్స్‌ను  వెల్లడించారు. అందరి అంచనాలను అందుకుంటూ ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్కు ఎంపికైంది. భారత్ నుంచి డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ఆల్ దట్ బ్రీత్స్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ నామినేషన్ పొందాయి. ఈ నామినేషన్స్ నుంచి ఎంపికైన విజేతలు మార్చి 13న లాస్ఎంజెలీస్ డాల్బీ థియేటర్లో పురస్కారాలు అందుకుంటారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events