నవీన్‌చంద్ర హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షోటైం. కామాక్షి భాస్కర్ల కథానాయిక. మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం. ఈ చిత్రాన్ని కిషోర్ గరికపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ హత్య చుట్టూ అల్లుకున్న సంఘటనలతో ట్రైలర్ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. వీటితో పాటు కోర్ట్‌రూమ్ సన్నివేశాలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠను పెంచేలా ఉన్నాయి.

మర్డరీ మిస్టరీ నేపథ్యంలో సాగే వినూత్నమైన కథ ఇదని దర్శకుడు తెలిపారు. తన కెరీర్‌లో ఇదొక ప్రత్యేక చిత్రమని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటుందని హీరో నవీన్‌చంద్ర తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణ సంస్థ: స్కైలైన్ మూవీస్, సమర్పణ: అనిల్ సుంకర, దర్శకత్వం: మదన్ దక్షిణామూర్తి.
