అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. మహేష్‌బాబు దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. ఆమెకు ఇది 48వ సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేశారు. మిర్చి, భాగమతి సినిమాలను చేశారు. ఈ చిత్రం ఈ నెల 4 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఓ కొత్తతరం కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో అనుష్క సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. దీన్ని తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఒకేసారి తెరకెక్కించనున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు: వంశీ, ప్రమోద్.














