నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఎన్‌బీకే 108 (NBK 108). షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఎక్జయిటింగ్ అప్‌డేట్ అందించారు మేకర్స్. కాజల్ అగర్వాల్ ఎన్‌బీకే 108 టీంతో చేరిపోయింది.కాజల్ అగర్వాల్ NBK 108లో మన నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన కథానాయికగా నటించబోతున్నారు. షూటింగ్ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ హైదరాబాద్‌లో ల్యాండింగ్ అయినట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఈ మూవీలో పెళ్లి సందD ఫేం శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణ రానున్న రోజుల్లో బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ తో అభిమానుల్లో జోష్ నింపబోతున్నట్టు తాజా అప్‌డేట్‌తో అర్థమవుతోంది.