ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయంపై ప్రపంచవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవితకు ఇక ఢోకా లేదంటూ ఘంటాపథంగా చెబుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా రాజధాని కాన్బెరా నగరంలోనూ ఎన్డీయే కూటమి పార్టీల నేతలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఎన్డీయే ఘన విజయం, ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించడాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. చంద్రబాబు సారథ్యంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు నివాళులు అర్పించారు.








