నరేష్ ఆగస్త్య, సంకీర్తన, ఆర్యన్ రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం అసురగణ రుద్ర. ఈ చిత్రం ద్వారా మురళీ కాట్రగడ్డ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మురళీ వంశీ నిర్మాత. మెడికల్ క్రైం థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నీ కనులలో అనే పాటను విడుదల చేశారు. శేఖర్ చంద్ర స్వరపరచిన ఈ పాటను సిద్ధార్థ్ మీనన్ ఆలపించారు. ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది. కథానుగుణంగా సంగీతానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది అని చిత్రబృందం పేర్కొంది. మురళీ శర్మ, ఆమని, శత్రు, అమిత్, అభినయ, దేవీ ఫ్రసాద్ లాంటి ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతిక విభాగం : రచన, దర్శకత్వం: మురళీ కాట్రగడ్డ, నిర్మాత: మురళీ వంశీ, బ్యానర్: కమ్జుల ప్రొడక్షన్స్, సంగీతం: శేఖర్ చంద్ర, డీవోపీ: అమరనాథ్ బొమ్మిరెడ్డి, ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్, ఫైట్స్: నబా మాస్టర్,పీఆర్వో : వంశీ శేఖర్
