Namaste NRI

నీదారే నీ కథ మూవీ టీజర్ లాంచ్

ప్రియతమ్‌, అంజన, విజయ్‌, అనంత్‌, వేద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం నీదారే నీ కథ. స్వీయ నిర్మాణ దర్శకత్వం. వంశీ జొన్నలగడ్డ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఆవిష్కరించారు. దర్శకనిర్మాత వంశీ జొన్న లగడ్డ మాట్లాడుతూ నేను న్యూయార్క్‌లో డైరెక్షన్‌ కోర్స్‌ చేశాను. మన తెలుగు నేటివిటీకి అనుగుణంగా చక్కటి కథాంశంతో ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశా. మ్యూజిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది  అన్నారు. ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌ ఇదని, అంతా కొత్తవారితో తెరకెక్కించామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అల్బర్టో గురియోలి, రచన: మురళీకాంత్‌, వంశీ జొన్నలగడ్డ, నిర్మాతలు: వంశీ జొన్నలగడ్డ, తేజేష్‌, శైలజ జొన్నలగడ్డ, నిర్మాణ సంస్థ: జేవీ క్రియేషన్స్‌, దర్శకత్వం: వంశీ జొన్నలగడ్డ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress