అభిరామ్, గీతిక జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అహింస. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని కలలో అయినా, కలిసుండని కాలాలైనా నీతోనే నీతోనే అంటూ సాగే పాటని విడుదల చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాటని సిధ్ శ్రీరామ్, సత్య యామిని పాడారు. సదా, కమల్ కామరాజు, రజత్ బేడీ, రవికాలే, మనోజ్ టైగర్, కల్పలత, దేవిశ్రీప్రసాద్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. సంభాషణలు : అనిల్ అచ్చుగట్ల.