కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం బెదురులంక 2012. నేహాశెట్టి కథానాయిక. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. బెన్నీ ముప్పానేని నిర్మాత. నేహాశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆమె లుక్‌ను విడుదల చేశారు. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ నటనకి ప్రాధాన్యమున్న పాత్రని పోషించారు నేహాశెట్టి. ఓ ఊరి నేపథ్యంలో సాగుతుంది. చిత్రీకరణ పూర్తయింది. కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటోరామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాద్, దివ్య నార్ని తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.