Skip to main content

Namaste NRI

జేడీ వాన్స్‎కు నెతన్యాహు కౌంటర్

ఇజ్రాయెల్‌కు ఉన్న ఏకైక శక్తివంతమైన మిత్రదేశం అమెరికా మాత్రమేనంటూ ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తోసిపుచ్చారు. ఆయన మాట్లాడుతూ వాన్స్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, ఆయన ప్రతి మాటనూ ఏకీభవించనంటూ మాకు భారత్‌ వంటి మరికొన్ని మిత్రదేశాలు ఉన్నాయని, 140 కోట్ల జనాభా కలిగిన ఆ చిన్న దేశం (వ్యంగ్య ధోరణిలో) నుంచి మాకు అపారమైన మద్దతు లభిస్తున్నది అని అన్నారు.

స్వదేశీ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు ఇజ్రాయెల్‌కు తమ మద్దతు తెలుపుతున్నారని నెతన్యాహు పేర్కొన్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌తో జరిపిన దౌత్యపరమైన చర్చలను ఇజ్రాయెల్‌ నేతలు వ్యతిరేకించడాన్ని జేడీ వాన్స్‌ తప్పుబడుతూ, ఒకవేళ తానే గనుక ఇజ్రాయెల్‌ క్యాబినెట్‌లో ఉంటే, ప్రపంచంలో తనకు మిగిలిన ఏకైక శక్తివంతమైన మిత్రదేశంపై దాడి చేసేవాడిని కాదంటూ వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events