Namaste NRI

అమెరికా లో కొత్త బిల్లు.. భారతీయులకు శుభవార్త!

అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల జారీ బ్యాక్‌లాగ్‌లో చిక్కుకున్న వారు కొంత మొత్తం చెల్లించడం ద్వారా గ్రీన్‌ కార్డు పొందొచ్చు. ఉద్యోగ ఆధారిత ఇమిగ్రెంట్‌ వీసాల్లో ప్రతి దేశానికి ఏడు శాతం పరిమితి ఉంది. దీంతో హెచ్‌ 1బీ వీసాలపై వచ్చిన వారు గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ ప్రతిపాదిత బిల్లు కాపీని విడుదల చేసింది. దీని ప్రకారం ప్రయారిటీ డేటా దాటి రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగ ఆధారిత వలసదారులు 5000 డాలర్లు అదనపు రుసుం చెల్లించడం ద్వారా సంఖ్యా పరిమితులు లేకుండా శాశ్వత నివాసం పొందొచ్చు. అదే ఈబీ `5 వీసాదారులు అయితే 50 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ ఆధారిత వలసదారులు గ్రీన్‌కార్డు పొందేందుకు 2500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చెల్లించే సాధారణ రుసుముకు అదనంగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

                ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే జ్యుడీషియరీ కమిటీ ఆమోదించాలి. ఆ తర్వాత ప్రతినిధుల సభ, సెనేట్‌ ఆమోదం పొందాలి. అనంతరం అధ్యక్షుడి సంతకంతో చట్టరూపం దాలుస్తుంది. ఒకవేళ ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే అమెరికాకు చిన్న వయసులో వచ్చినవారు, తాత్కాలికంగా రక్షణ పొందినవారు, వ్యవసాయ కూలీలు, మహమ్మారి కాలంలో అత్యవసర కార్మికులు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events