క్రాంతి, శ్రీలు జంటగా నటిస్తున్న చిత్రం కొత్త రంగుల ప్రపంచం. సీనియర్ నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దర్శకుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఇన్నాళ్లు నన్ను ఆర్టిస్టుగా ఆదరించారు. ఈ సినిమాతో దర్శకుడిగా మీ ముందుకు వస్తున్నా. పేరుకు తగ్గట్టుగానే అందమైన ప్రేమకథా చిత్రమిది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుంది. వినోదానికి పెద్దపీట వేశాం అన్నారు. హృద్యమైన భావాలు కలబోసిన లవ్‌స్టోరీ ఇదని హీరో క్రాంతి చెప్పారు. ఈ నెల 20న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: శివారెడ్డి, నిర్మాతలు: పద్మరేఖ, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, దర్శకత్వం: పృథ్వీరాజ్.