ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారు 2023 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 8 వ తేదీన డాలస్‌లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్బంగా శరత్ రెడ్డి ఎర్రం సంస్థ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. టాంటెక్స్ లాంటి గొప్ప సంస్థకి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
అధికారిక కార్యనిర్వాహక బృందం
అధ్యక్షుడు: శరత్ రెడ్డి ఎర్రం, సంయుక్త కార్యదర్శి: స్రవంతి యర్రమనేని, ఉత్తరాధ్యక్షుడు: సతీష్ బండారు, కోశాధికారి: రఘునాథ రెడ్డి కుమ్మెత, ఉపాధ్యక్షులు: చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, సంయుక్త కోశాధికారి: రాజా మాగంటి, కార్యదర్శి : మాధవి లోకిరెడ్డి, తక్షణ పూర్వాధ్యక్షులు: ఉమామహేష్ పార్నపల్లి.
సురేష్ పఠనేని, సుబ్బారెడ్డి కొండు, కళ్యాణి తాడిమేటి, ఉదయ్ కిరణ్ నిడిగంటి , శ్రీనివాసులు బసాబత్తిన, దీప్తి సూర్యదేవర, శాంతి నూతి, శ్రీనివాస పాతపాటి, కృష్ణా రెడ్డి మాడ, విజయ్ సునీల్ సూరపరాజు, లక్ష్మినరసింహ పోపూరి, రాజాప్రవీణ్ బాలిరెడ్డి, చైతన్యరెడ్డి గాదె
పాలక మండలి బృందం
అధిపతి: అనంత్ మల్లవరపు, ఉపాధిపతి: డాక్టర్ భాస్కర్ రెడ్డి సానికొమ్ము, గీతా దమ్మన్న, హరి సింగం, డాక్టర్ వెంకటసుబ్బరాయ చౌదరి ఆచంట, హరి సింగం డాక్టర్ కొండా తిరుమల రెడ్డి, సురేష్ మండువ
కొత్త పాలక మండలి మరియు కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలతో ,సరికొత్త ఆలోచనలతో 2023 లో అందరిని అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని, స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ ఉంటాయని ఆశిస్తున్నానని సంస్థ నూతన అధ్యక్షులు శరత్ రెడ్డి ఎర్రం తెలిపారు.