Skip to main content

Namaste NRI

అమెరికా శాస్త్రవేత్తల సరికొత్త ప్రయోగం

వాడిన వంట నూనెతో బయోడీజిల్‌ను తయారు చేసే సరికొత్త పద్ధతిని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన రసాయన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వృథా వంటనూనె, సోడియం టెట్రామెథాక్సిబోరేట్‌ కలిపి ఈ బయోడీజిల్‌ను తయారు చేశారు. కేవలం గంట సేపటి లోపే బయోడీజిల్‌ తయారీ పూర్తవుతుందని చెప్పారు. కేవలం 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడి చేస్తే చాలని, నీటిని వేడి చేసే కంటే తక్కువ ఉష్ణోగ్రత సరిపోతుందని తెలిపారు. ఈ బయోడీజిల్‌ తయారీకి రీఫైనరీలు కూడా అవసరం లేదని, సులువుగా తయారుచేయవచ్చని చెప్పారు. దీని ద్వారా డబ్బు, విద్యుత్తు ఆదా అవుతుందని తెలిపారు. పారిశ్రామిక అవసరాల కోసం కూడా ఈ బయోడీజిల్‌ను ఉపయోగించవచ్చని చెప్పారు.

Social Share Spread Message

Latest News