వాట్సాప్ అప్‌డేట్స్‌లో బెస్ట్ ఫీచర్లలో మెసేజ్ డిలీషన్ ఆప్షన్ ఒకటి. వాట్సాప్‌లో మీరు ఒక్కసారి మెసేజ్ పంపిన తర్వాత, ఏదైనా మార్పులు చేయాలనుకుంటే చేయగలరా? చేయలేరు కాకపోతే దాన్ని ఎదుట వ్యక్తి చూడకుండా డిలీట్ చేయొచ్చు. అయితే మీరు పంపిన మెసేజ్‌లో మార్పులు (ఎడిట్) చేసుకునే వీలు కల్పించేందుకు కొత్త ఫీచర్ తీసుకొస్తున్నది వాట్సాప్. అయితే ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉన్నదని కంపెనీ వెల్లడిరచింది. మెసేజ్‌ను పంపిన తర్వాత ఎడిట్ చేస్తే పాత వెర్షన్ కనిపించకుండా కూడా చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఫీచర్ ఇప్పటికే వాట్సాప్ బీటా వెర్షన్‌లో టెస్టింగ్‌లో ఉంది. వాట్సాప్ బీటా 2.22.13.6 వెర్షన్‌లో దీన్ని కొంతమంది యూజర్లు వాడుతున్నారు. అంతేకాకుండా వాట్సాప్‌కు పోటీదారు అయిన టెలిగ్రామ్‌లో కూడా ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది.