Namaste NRI

కాలిఫోర్నియాలో కొత్త చట్టం.. కీలక నిర్ణయం తీసుకున్న ఎలాన్‌ మస్క్‌

 ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌ స్పేస్‌ఎక్స్‌ , ఎక్స్‌ హెడ్‌ కార్వర్ట్‌ను మరో సిటీకి తరలించనున్నారు. ఈ విషయాన్ని మస్క్‌ వెల్లడించారు. స్పేస్‌ఎక్స్‌ కార్యాలయాన్ని టెక్సాస్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు. స్పేస్‌ఎక్స్ ప్రధాన కార్యాలయం ప్రస్తుతం కాలిఫోర్నియాలోని హాథోర్న్‌లో ఉందని తెలిపారు. టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎక్స్‌ సోషల్‌ మీడియా ప్రధాన కార్యాలయం శాన్‌ఫ్రాన్సి స్కోలో ఉండదని,  ఆస్టిన్‌కు తరలించనున్నారు.

ఈ నిర్ణయం వెనుక ఇటీవల కాలిఫోర్నియాలో గవర్నర్‌ ఓ చట్టంపై సంతకం చేశారు. విద్యార్థుల జెండర్‌ గుర్తింపు మార్పులపై గురించి తల్లిదండ్రులకు చెప్పకుండా టీచర్లను నిషేధించే బిల్లుపై గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌ సంతకం చేశారు. ఈ క్రమంలో మస్క్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గతంలో చేసిన చట్టాలతో పోలిస్తే ప్రస్తుతం తెచ్చిన చట్టం పరాకాష్ఠ అని,  ఇలాంటి నిర్ణయాలతో కుటుంబాలు, కంపెనీలు తమ పిల్లల రక్షణ కోసం కాలిఫోర్నియా నుంచి వెళ్లిపోతాయని గతంలోనే తాను గవర్నర్‌కు స్పష్టంగా చెప్పినట్లు మస్క్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events