పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో సోషియా ఫాంటసీ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్‌కు జోడిగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఏఎమ్ రత్నం, దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. భారీ యాక్షన్ షెడ్యూల్‌కు యూనిట్ రెడీ అవుతోంది. కాగా శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ పవన్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆద్యంతం కట్టుకుంది. పోస్టర్‌ను పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ యాక్షన్ మోడ్ హైలెట్‌గా ఉండనుంది. గ్రీన్ కలర్ దుస్తులపై మెడలో సాలూవా ధరించి చేతీలో ఈటు పట్టుకుని గంభీరమైన చూపుతో శత్రువువైపు గురిపెట్టినట్టు కన్పిస్తోంది. కథ తాలూకు చారిత్రక నేపథ్యాన్ని స్ఫురించేలా ఆయన ఆహార్యం ప్రత్యేకంగా కనిపిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణల రచయిత. జ్ఞానశేఖర్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు కానుంది.














