Namaste NRI

సలార్ మూవీ నుంచి స‌రికొత్త ప్రోమో విడుద‌ల

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ​ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సలార్. ఈ ఏడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది సలార్. ఈ చిత్రం వరల్డ్​వైడ్​గా రూ.178.7 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా క‌లెక్ష‌న్స్ చూసుకుంటే 10 రోజుల్లో రూ.625 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక ఈ సినిమా చివరలోనే సలార్‌-2 గురించి అనౌన్స్‌ చేయడంతో శౌర్యాంగ పర్వం పై అంచనాలు మరింతగా పెరిగాయి. సెకండ్‌ పార్ట్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా వుంటే తాజాగా ఈ మూవీ నుంచి స‌రికొత్త ప్రోమో విడుద‌ల చేశారు.

సాలార్ సీజ్ ఫైర్ వెల‌మ్‌గ‌డి ప్రోమో అనే పేరుతో ఈ ప్రోమో విడుద‌ల చేయ‌గా,  వ‌ర‌దా నీ కొడుకును చంప‌లేదు. చంపింది ఆ కొత్త‌గా వ‌చ్చినోడు. ఆ విష‌యం గుర్తుపెట్టుకో. నీ కొడుకు విష్ణుని నిర్దాక్షిణంగా చంపుతుంటే ఏమి చేయకుండా నిలుచున్నాడు. నిన్ను ఎవడు ముట్టుకోకూడదు అంటూ సాగిన డైలాగ్‌ ప్రోమో గూస్ బంప్స్ తెప్పించేలా సాగింది. భారీ అంచనాల మ‌ధ్య డిసెండ‌ర్ 22న విడుద‌లైన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events