కరోనా కేసులు రోజు రోజుకూ క్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో డీజీసీఐ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ ఫోర్త్‌వేవ్ సంకేతాలు వెలువడుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మాస్క్ లేకుండా సంచరించకూడదనే నిబంధనను మళ్లీ డీజీసీఐ తీసుకొచ్చింది. నో మాస్క్ నో ఎంట్రీ రూల్‌ని విమానాశ్రయాల్లో స్ట్రిక్ట్‌గా అమలు చేయాలని నిర్ణయించింది. ఢల్లీి హైకోర్టు కొవిడ్ నిబంధనలు పాటించని ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పౌర విమానయాన శాఖను అలర్ట్ చేసింది. విమాన ప్రయాణికులు ఇకనుంచి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డీజీసీఐ కొత్త ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించకపోతే బోర్డింగ్ వద్దే ప్రయాణికుల్ని నిలిపివేయనున్నారు. మాస్క్ ధరిస్తేనే విమానాశ్రయంలో అనుమతి ఉంటుంది.














