Skip to main content

Namaste NRI

హెచ్‌-1బీకి కొత్త రూల్స్‌ .. జూలై 10 నుంచి

హెచ్‌-1బీ వీసా పిటిషన్లు, గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తులు సహా ఇమిగ్రేషన్‌ ప్రయోజన అభ్యర్థనలపై దరఖాస్తుదారులు ఎలా సంతకం చేయాలన్న విషయమై అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) జూలై 10 నుంచి కొత్త నిబంధనలను విధించనున్నది. కొత్త నిబంధనల ప్రకారం చేతిరాతతో చేసిన సంతకాలు లేదా నకలు సంతకాన్ని(రీప్రొడ్యూస్డ్‌ సిగ్నేచర్‌) మాత్రమే అధికారులు స్వీకరించనున్నారు. కాపీ పేస్ట్‌ చేసిన సంతకం, ఆటో జనరేటెడ్‌ లేదా అనధికార సంతకంతో కూడిన దరఖాస్తును అధికారులు తిరస్కరిస్తారు. చెల్లుబాటు కాని సంతకాలతో కూడిన దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తారు. లోపాలతో కూడిన సంతకాన్ని సరిదిద్దుకునే అవకాశాన్ని యూఎస్‌సీఐఎస్‌ కల్పించదు. అయితే తగిన ఫీజు చెల్లింపుతోసహా ఇతర అవసరమైన పత్రాలు ఉంటే సరైన సంతకంతో మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని యూఎస్‌సీఐఎస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Social Share Spread Message

Latest News