భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు బ్రిటన్ ప్రభుత్వం పలు ఆంక్షలను సడలించింది. తమ దేశానికి వచ్చే భారతీయులు ఇకపై ఖరీదైన పీసీఆర్ టెస్టులను చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన రెడ్` అంబర్` గ్రీన్ జోన్లలో భారత్‌ను అంబర్ కేటగిరి నుంచి యూకే తొలగించింది.
భారతదేశంలో విమానం ఎక్కడానికి మూడు రోజుల ముందు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలి. లండన్‌కు వచ్చాక 2వ, 8వ రోజు ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. భారత్ నుంచి బయలుదేరే ముందే వీటిని బుక్ చేసుకోవాలి. భారత్‌లో పూర్తిగా టీకాలు తీసుకున్నా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. 18 ఏళ్లలోపు వారికి ఈ నియమం వర్తించదు. 11 ఏళ్లలోపు వారు ప్రయాణానికి ముందు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 2వ రోజు ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. 5 ఏళ్ల లోపు పిల్లలకు ఎటువంటి పరీక్షలు చేయించాల్సిన అసవరం లేదు.