
ప్రపంచ సినిమాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానం గురించి అకాడమీ కొత్త వివరాలను వెల్లడించింది. 2026 మార్చి 15న ఆస్కార్ పురస్కారాల వేడుకను జరుపబోతున్నట్లు పేర్కొంది. ఈసారి ఆస్కార్ అవార్డుల ఎంపికలో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. సినీరంగంలో పెరుగుతున్న సాంకేతికతను దృష్టిలో పెట్టుకొని ఏఐ ఆధారిత చిత్రాలను కూడా ఆస్కార్ అవార్డుల పరిశీలనకు తీసుకోనున్నట్లు తెలిపింది. ‘ఆస్కార్‌లో పోటీపడనున్న చిత్రాల జాబితాను 2026 జనవరిలో ప్రకటిస్తాం. నామినేట్ చేసిన ప్రతీ చిత్రాన్ని అకాడమీ సభ్యులు తప్పకుండా వీక్షించేలా నిబంధనలను సవరించాం. అచీవ్‌మెంట్ ఇన్ కాస్టింగ్ అనే కొత్త కేటగిరీని వచ్చే ఏడాది నుంచి ప్రవేశ పెడుతున్నాం. ఏఐ చిత్రాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ మామూలు చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.’ అని ఆస్కార్ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొద్దిరోజుల క్రితమే ఆస్కార్ అవార్డుల్లో ‘స్టంట్ డిజైన్’ పేరిట కొత్త కేటగిరీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
