ట్విటర్ సిబ్బందికి ఎలన్ మస్క్ కొత్త నిబంధనలు విధించారు. వాటిని పాటించే వాళ్లే కొనసాగాలని, కుదరని వాళ్లు వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేశారు. 50 శాతం మంది సిబ్బందిని తొలగించిన తర్వాత మిగతా సిబ్బందితో మస్క్ సమావేశమయ్యారు. ఇకపై వారానికి 80 గంటల పని చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు చేస్తున్నాం. కార్యాలయంలో ఉచిత భోజనాలు కూడా ఇక ఉండవు. కష్టపడి పనిచేసి ఆదాయం తేకుంటే వచ్చే ఏడాదికే కంపెనీ దివాలా తీస్తుంది. రానున్నవన్నీ గడ్డు రోజులే. ట్విటర్ కొనసాగలనుకునే వారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. లేకపోతే ఆఫీసుకు రావద్దు..రాజీనామా చేయండి అంటూ కుండబద్దలు కొట్టారు. కొందరు ఉద్యోగులు ఈ వివరాలు బయట పెట్టారు.