భారత్ సహా పలు దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ అగ్రరాజ్యం అమెరికా కీలక ఆదేశాలు జారీ చేసింది. కాకపోతే కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. తాజా నిర్ణయం నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. అమెరికా వచ్చే ముందు కరోనా వైరస్ పరీక్ష నెగిటివ్ రిపోర్టును చూపించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రయాణ మార్గదర్శకాలలో టెస్టింగ్ చుట్టూ ప్రోటోకాల్స్ ఉన్నాయి. వ్యాక్సినేషన్ తీసుకొని అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణం ఒక రోజు ముందు కోవిడ్ పరీక్ష చేసుకోవాలని స్పష్టం చేసింది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రారంభం కావడంతో అమెరికా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది.