Namaste NRI

కొత్త కొత్తగా థియేట్రికల్‌  ట్రైలర్‌  విడుదల

అజయ్‌, వీర్తి వఘాని జంటగా హనుమాన్‌ వాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కొత్త కొత్తగా. ఆనంద్‌, తులసి, కాశీ విశ్వనాథ్‌, కల్యాణి నటరాజన్‌ ప్రధాన పాత్రధారులు. న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ చిత్రం  ట్రైలర్‌ని విడుదల చేశారు. రెండు నిమిషాల 30 సెకన్లు నిడివి గల ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. కొత్తతరం ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమిది. కుటుంబ అనుబంధాలు, డ్రామాకి పెద్దపీట వేశాం. ప్రేమలో పడిన ఓ కొత్త జంట ఎలాంటి ఇరకాటాల్ని ఎదుర్కొందనేది ఆసక్తికరం. ట్రైలర్‌కి మంచి స్పందన లభిస్తోంది. కథ, నటులతో పాటు శేఖర్‌ చంద్ర సంగీతం, సిద్‌శ్రీరామ్‌ పాడిన పాట, వెంకట్‌ కెమెరా పనితనం చిత్రానికి ప్రధానబలం అన్నారు దర్శక నిర్మాతలు. కాశీ విశ్వనాథ్‌, తులసి, కల్యాణి నటరాజన్‌, పవన్‌ తేజ్‌, ఈ రోజుల్లో సాయి తదిరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మురళీధర్‌రెడ్డి ముక్కర నిర్మాత. బి.జి.గోవిందరాజు సమర్పకులు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రానికి ప్రవీణ్‌  పూడి ఎడిటర్‌గా, సురేష్‌ భీమగాని ఆర్ట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events